AIPEU GDS (NFPE) మరియు NFPE (ఫెడరేషన్) సంయుక్తంగా
జి. డి . ఎస్ ఉద్యోగుల సివిల్ సర్వెంట్ హోదా కొరకు సుప్రీం కోర్టు లో కేసు దాఖలు చేయడమైనది.
- జి.డి.ఎస్.ఉద్యోగులను రెగ్యులర్ డిపార్టుమెంటుమెంటల్ ఉద్యోగులుగా పరిగణిస్తూ, డిపార్టుమెంటు ఉద్యోగుల సదుపాయములు, రిటైర్మెంట్ సదుపాయములు కలుగజేయాలి.
- జి.డి.ఎస్ (కాండక్ట్ & ఎంగేజ్మెంట్ రూల్స్) 2011 ను రాజ్యాంగ విరుద్దమైనవిగా ప్రకటించ వలసినది.
గా కోరుతూ రిట్ పిటిషన్ (నెం . 1003 / 2013) వేయబడినది.
రిట్ పిటిషన్ పై సుప్రీం కోర్టు సానుకూలముగా స్పందిస్తూ, 3 లక్షల ఉద్యోగుల కు సంబంధిచిన విషయమని, మొదట ఒక హైకోర్టు పరిధిలో పరిశీలించ వలసినదిగా తెలియ జేస్తూ, రిట్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టుకు బదిలీ చేసినది.
తదుపరి విచారణ హైకోర్టు లో జరుగనున్నది.
1993 సం॥ లో ఎన్.ఎఫ్.పి.ఇ జరిపిన అనేక పోరాటాల ఫలితమే "జస్టిస్ తల్వార్ కమిటీ". అది ప్యాకేజి రూపములో అమలు జరిగినప్పటికీ, జి.డి .ఎస్ వ్యవస్థలో పెను మార్పు కలిగించినది.
తదుపరి 6 వ వేతన కమిటీ సమయములో ఏర్పడిన అనేకానేక సంఘటనల మూలముగా ప్రస్తుత జి.డి.ఎస్ ల పరిస్థితి ఏ విధముగా తయారై ఉన్నదో వివరించనక్కరలేదు.
అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాధమిక విషయాలలో సంఘ పోరాటం తో పాటు న్యాయ పోరాటమూ అవసరమే. ఏంతో దూరదృష్టితో, ఎంతో మంది న్యాయ నిపుణులు, నాయకుల, శ్రేయోభిలాషుల సలహాలతో, ఎన్.ఎఫ్. పి .ఇ సంఘాల సహకారముతో, ఈ మహత్తర న్యాయ పోరాటానికి జి.డి.ఎస్. (ఎన్.ఎఫ్.పి.ఇ ) కేంద్ర సంఘం సాహసముతొ ముందడుగు వేసినది.
ప్రతి జి.డి.ఎస్ కోరిక "డిపార్టుమెంటు ఉద్యోగి " కావాలనే .
మీ అందరి కోరిక ఆశీర్వాదమై, ఆదరణ తో పాటుగా ఒక అపూర్వ సంఘటిత శక్తిగా రూపొంది పోరాటం ప్రారంభిస్తే విజయం చేరువలోనికి వస్తుంది.
సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసిన తరువాత - తనంతట తానుగా కేసు ను ఢిల్లీ హైకోర్టు కు బదిలీ చేసి విచారణ జరిపించడం అరుదైన విషయము.
న్యాయ పోరాటములో విజయం సాధించ గలమన్న విశ్వాసంతో వున్నాము.
ఎవరెన్ని వక్రభాష్యాలు చేసినా జి. డి . ఎస్. (ఎన్. ఎఫ్. పి. ఇ ) సంఘం ద్వారా జరిపే జి. డి . ఎస్. ఉద్యోగుల కొరకు జరిగే ప్రతి పోరాటంలో ఫలితాన్ని, విజయాన్ని సాధించుకొగలము.
ఎన్. సమ్మయ్య
సర్కిల్ కార్యదర్శి
No comments:
Post a Comment